మంచాల మండల రూపురేఖలు మార్చడమే లక్ష్యం
*మంచాల మండల రూపురేఖలు మార్చడమే లక్ష్యం* *అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి* మంచాల, అక్టోబర్ 3 (ప్రజావాణి): ప్రభుత్వ పథకాలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అధికారులు వారధిగా పనిచేయాలని సూచించారు. శనివారం మంచాల మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ పథకాల అమలు తీరును...