*మంచాల మండల రూపురేఖలు మార్చడమే లక్ష్యం*
*అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి*
మంచాల, అక్టోబర్ 3 (ప్రజావాణి): ప్రభుత్వ పథకాలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అధికారులు వారధిగా పనిచేయాలని సూచించారు. శనివారం మంచాల మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ పథకాల అమలు తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు హెడ్‌క్వార్టర్స్‌కే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. కార్యాలయానికి వచ్చామా.. వెళ్లిపోయామా అన్నట్లుగా విధులు నిర్వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.
పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర
గ్రామాల అభివృద్ధి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర అని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లోని సమస్యలను గుర్తించి సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిరోజూ ఏయే అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారో గ్రామపంచాయతీలో రికార్డు నిర్వహించాలని అన్నారు.

తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిదీపాలు, రోడ్ల పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలును నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జీపీవోలతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులు ముందుండి పనిచేయాలని అన్నారు.
మండల రూపురేఖలు మార్చుతాం
వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మంచాల మండలాన్ని అన