prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 8:20 am Digital Edition : PRAJA VANI

మంచాల గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు

*మంచాల గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు*
*మంచాల గ్రామంలో విశ్వకర్మ యూత్, కురుమ సంఘం, చండీశ్వర యూత్, మణికంఠ యూత్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు .*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అక్టోబర్ 19 (ప్రజావాణి) : మహిళలు, చిన్నారులు వివిధ రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, బతుకమ్మ ఆటలు ఆడుతూ మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరమ్మ ఆశీస్సులతో మంచాల గ్రామం ప్రజలు సుభిక్షంగా ఉండాలని. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మహిళలు, చిన్నారులు ప్రార్థించారు.
ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, గ్రామ ప్రజలందరికీ మంచి జరగాలని గౌరమ్మకు పూజలు చేశారు. బతుకమ్మకు వీడ్కోలు చెప్పారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు