prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 8:06 pm Digital Edition : PRAJA VANI

భారతీయ జనతా పార్టీ (BJP) మేడ్చల్ జిల్లా BJYM కార్యదర్శిగా జవహర్ నగర్ డివిజన్ నుండి శశాంక్ సింగ్ (రాహుల్) నియామకం

భారతీయ జనతా పార్టీ (BJP) మేడ్చల్ జిల్లా BJYM కార్యదర్శిగా జవహర్ నగర్ డివిజన్ నుండి శశాంక్ సింగ్ (రాహుల్) నియామకం–

జవహర్ నగర్, అక్టోబర్ 16 (ప్రజావాణి ప్రతినిధి ):

గత 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న శశాంక్ సింగ్ (రాహుల్) గారిని మేడ్చల్ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) కార్యదర్శిగా నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శశాంక్ సింగ్ రాహుల్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ నియామకానికి సహకరించి, తనకు ప్రోత్సాహం అందించిన నాయకులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్,రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ళ విక్రమ్ రెడ్డి , జిల్లా BJYM అధ్యక్షులు రాగం అర్జున్, మరియు నన్ను అనునిత్యం వెన్నుతట్టి ప్రోత్సహించే మా మార్గదర్శి జవహర్ నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు కళికోట కమలాకర్ గారికి అలాగే నా ఈ ప్రయాణంలో నన్ను ప్రోత్సహించే తల్లిదండ్రులకు ఈ నియామకంలో సహకరించిన పెద్దలందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, యువతను పార్టీ సిద్ధాంతాల వైపు చైతన్యపరుస్తూ, యువత అభ్యున్నతికి మరియు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా శశాంక్ సింగ్ (రాహుల్) గారు పేర్కొన్నారు.