బ్యాంక్ కాలనీలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
బ్యాంక్ కాలనీలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆటపాటలు.. నిమజ్జనంలో పాల్గొన్న పడాల రఘురాములు పటేల్ కుటుంబ సభ్యులు మేడ్చల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మేడ్చల్లోని బ్యాంక్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో పండుగ సందడి నెలకొంది. మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్త శ్రీ పడాల రఘురాములు పటేల్ కుటుంబ సభ్యులు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ...