prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 6:36 pm Digital Edition : PRAJA VANI

బోరంచ లో కోలాటాలతో విజయ దశమి సంబరాలు…ముఖ్య అతిథులకు సన్మానం

బోరంచ లో కోలాటాలతో విజయ దశమి సంబరాలు…ముఖ్య అతిథులకు సన్మానం

*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 21 సంగారెడ్డి జిల్లా*

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామం లో పపామ్మ గడ్డ కాలనీ లో విజయ దశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు కలిసి కోలాటాలు ఆడుతూ పండుగా సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోరంఛ గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు సంగారెడ్డి, బృందం పాల్గొని కాలనీ వాసులకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాలనీ వాసులు అతిథులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పపామ్మ గడ్డ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.