బోయకొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు
బోయకొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు తొలిరోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చిన గంగమ్మ తల్లి ప్రజావాణి, చౌడేపల్లి: పుంగనూరు నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ శ్రీ గంగమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మధుసూదన్ నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఏకాంబరం ఆలయ మర్యాదలతో మధుసూదన్ నాయుడుకు స్వాగతం పలికారు. అమ్మవారికి...