prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 5:13 pm Digital Edition : PRAJA VANI

బోడుప్పల్, చెంగిచెర్ల, జవహర్ నగర్, చంద్రపురి కాలనీ కాంగ్రెస్ డివిజన్ కమిటీల ప్రకటన

బోడుప్పల్, చెంగిచెర్ల, జవహర్ నగర్, చంద్రపురి కాలనీ కాంగ్రెస్ డివిజన్ కమిటీల ప్రకటన–

జవహర్ నగర్, అక్టోబర్ 16 (ప్రజావాణి ప్రతినిధి ):

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు మరింత బలం.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే ధ్యేయం!

మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్, చెంగిచెర్ల, జవహర్ నగర్, చంద్రపురి కాలనీల,కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి కమిటీలను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు ప్రకటించారు,

ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని, ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

పదవులు బాధ్యతకు ప్రతీకలు.. ప్రజాసేవే లక్ష్యం.. కాంగ్రెస్ విజయమే ధ్యేయం! అని పేర్కొంటూ, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, బోడుప్పల్ మాజీ అధ్యక్షుడు పోగుల నర్సింహారెడ్డి, మాజీ మేయర్,అజయ్ యాదవ్, బోడుప్పల్ డివిజన్ అధ్యక్షుడు బొమ్మకు కళ్యాణ్, చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షుడు పోగుల దిలీప్ రెడ్డి, జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు శాంతి కోటేష్ గౌడ్, చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, కొత్త కిషోర్ గౌడ్,జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి, శెట్టి శ్రీనివాస్ మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, నూతన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

తోటకూర వజ్రేష్ యాదవ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేద్దాంప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందాం