బోడుప్పల్ ఆర్ఎన్ఎస్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
మేడిపల్లి, అక్టోబర్ 10 (ప్రజావాణి): మేడిపల్లి మండలం బోడుప్పల్ నగరంలోని ఆర్ఎన్ఎస్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి ఒకచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు వెంకటరమణ, కార్యదర్శి పవన్ కుమార్, కోశాధికారి దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ప్రహ్లాద్ రెడ్డి, నాగరాజు, రమేష్, సురేష్‌తో పాటు...