prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 11:18 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

బోడుప్పల్ ఆర్ఎన్ఎస్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

మేడిపల్లి, అక్టోబర్ 10 (ప్రజావాణి): మేడిపల్లి మండలం బోడుప్పల్ నగరంలోని ఆర్ఎన్ఎస్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి ఒకచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు వెంకటరమణ, కార్యదర్శి పవన్ కుమార్, కోశాధికారి దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ప్రహ్లాద్ రెడ్డి, నాగరాజు, రమేష్, సురేష్‌తో పాటు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

బతుకమ్మ వేడుకలతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మను పూజించి, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ వేడుకలు మహిళల్లో ఐక్యతను, తెలంగాణ సంస్కృతి పట్ల అభిమానాన్ని చాటిచెప్పాయి.