prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 4:17 pm Digital Edition : PRAJA VANI

బోడకొండలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి 30 మంది చేరిక

*బోడకొండలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి 30 మంది చేరిక*

*ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తకు, నాయకుడికి అండగా ఉంటా.. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే నా లక్ష్యం*

*ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి*

రంగారెడ్డి జిల్లా మంచాల అక్టోబర్ 11 (ప్రజావాణి):మంచాల మండలం బోడకొండ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు 30 మంది మంచాల మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎడ్మ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, ప్రతి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడికి, కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన పేద కుటుంబాలకు అందించడమే తన లక్ష్యమని అన్నారు. మంచాల మండలాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దేవసోత్‌ అథీరామ్‌ నాయక్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాయకులు జాటోత్‌ నాయక్‌, బానోత్‌ మోహన్‌ నాయక్‌, జాటోత్‌ నవీన్‌ నాయక్‌, జాటోత్‌ దేవారామ్‌, రమేష్‌ నాయక్‌, కాట్రోత్‌ సన్నీ, రమేష్‌, ప్రవీణ్‌, పవన్‌, చింటూ, లక్ష్మణ్‌, కొర్ర ప్రవీణ్‌ తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వింజమూరు ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గుండెమోని మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.