ఘట్కేసర్, అక్టోబర్ 16 (ప్రజావాణి): ఘట్కేసర్ 6వ డివిజన్ పరిధిలోని బోక్కోనిగూడ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బొక్క భారతమ్మ, బొక్క ముత్యాలు, ఎంపాల మల్లమ్మ, కట్ట సుగుణమ్మ, బొక్క మంగ, బొక్క శ్రీలత, ఎంపాల స్వాతి, బొక్క లావణ్య, ఎంపాల రజిని, మమత, శ్వేతతో పాటు పలువురు మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.