prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 9:03 pm Digital Edition : PRAJA VANI

బొడ్డెమ్మ పండుగ మహిళలకు

బొడ్డెమ్మ పండుగ మహిళలకు..
బొమ్మెర బ్రదర్స్ బహుమతులు వితరణ..
ప్రజావాణి,ఇనుగుర్తి: బొడ్డెమ్మ పండుగ చివరి రోజు శుక్రవారం ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గురుజు గడ్డ కాలనీలోనిలో బొడ్డెమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు బొమ్మెర బ్రదర్స్ బహుమతులు వితరణ చేశారు. సంబంధిత గిఫ్టులను స్వర్గీయ బొమ్మెర నారయ్య గౌడ్ యాకమ్మ దంపతుల జ్ఞాపకార్థం మనుమలు బొమ్మెర రమేష్ గౌడ్,సతీష్ గౌడ్, సంతోష్ గౌడ్, సందీప్ గౌడ్ లు బహుకరించారు. ఈ సందర్భంగా బొమ్మెర బ్రదర్స్ సంయుక్తంగా మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే బొడ్డెమ్మ పండుగను ఉత్సాహభరితంగా జరుపుకొని భవిష్యత్ తరాలకు మన పండుగల ఔన్నత్యాన్ని తెలుపుతున్న మహిళలను ప్రోత్సహించేందుకు బహుమతులు అందజేసినట్లు తెలిపారు.