prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 4:46 pm Digital Edition : PRAJA VANI

బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

*బైక్ అదుపుతప్పి యువకుడు మృతి…*
చిలప్ చేడ్, 22 అక్టోబర్ మన ప్రజావాణి.నియోజక వర్గం ప్రతినిధి.

మండల పరిధిలోని గుజ్జి తాండా గ్రామపంచాయతీ సమీపంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌతాపూర్ దగ్గర మంగళవారం నాడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు చిలప్ చేడ్ SI నరసింహులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే హత్నూరా మండలం వీర్ల తాండా (దేవుని గుట్ట తాండా) గ్రామానికి చెందిన యువకుడు రాహుల్(22), ధనరాజ్ ఇద్దరు కలిసి బైక్ పై చిలప్ చేడ్ మండలంలోని గోతాపూర్ గ్రామానికి వెళుతుండగా సుమారు రాత్రి 10:30 గంటల సమయంలో గౌతాపూర్ హై స్కూల్ దగ్గర అతివేగంతో బైక్ నడుపుతుండగా అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టి రాహుల్ అక్కడికక్కడే మృతి చెందాడు, ధనరాజ్ తీవ్ర గాయాలతో జోగిపేట ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మల్లారెడ్డి హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు.

రాహుల్ భౌతికకాయానికి జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి నందు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని మృతుడి తండ్రి లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు.