prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 1:30 pm Digital Edition : PRAJA VANI

బెజ్జంకి మోడల్ స్కూల్‌ను సందర్శించిన సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి డీఈఓ సి. రమేష్

బెజ్జంకి మోడల్ స్కూల్‌ను సందర్శించిన

సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి డీఈఓ సి. రమేష్

బెజ్జంకి, అక్టోబర్ 9 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను సీఈఓ, ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి సి. రమేష్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రిజిస్టర్ ని తనిఖీ చేసి,పాఠశాల నిర్వహణకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.
అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతతో, పరిశుభ్రంగా అందించాలని పాఠశాల ప్రిన్సిపాల్ ఖలీదా షిరీన్‌కు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ భోజన నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.పాఠశాల నిర్వహణ, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.