బుగ్గనగర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

బుగ్గనగర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకల ఘట్‌కేసర్, అక్టోబర్ 16 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని బుగ్గనగర్ కాలనీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ మహిళలు సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలతో బుగ్గనగర్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. కాలనీ మహిళలంతా ఐకమత్యంతో...