బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనా బీసీలకు న్యాయం చేస్తాం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు ప్రజావాణి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి, అక్టోబర్ 8: బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించి, రాజ్యాధికారం అందించడమే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. చట్టపరంగా, న్యాయపరంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలకు న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా...