బీర్కూర్ విబీజి- రామ్ జీ ప్రత్యేక గ్రామసభ నిర్వహించిన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ పాలకవర్గం…….
బీర్కూరు మండల కేంద్రంలో శుక్రవారం రోజున వీబీజీ- రాంజీ పథకంలో భాగంగా సర్పంచ్ అరిగే ధర్మతేజ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి ఉపాధి పనులపై చర్చించారు. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి హామీ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా సర్పంచ్ అరిగే ధర్మతేజ సూచించారు. అంతేకాకుండా ఉపాధి హామీని మెరుగుపరచడమే లక్ష్యమని అన్నారు. గతంలో 100 రోజుల పనిని ఇప్పుడు 125 రోజులకు పెంచడం జరిగింది కాబట్టి ఉపాధి హామీని నిర్వహించడం వలన కూలీలకు 308రూపాయలు వేతనం చెందించడమే కాకుండా అభివృద్ధి విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుండి గ్రామపంచాయతీకి 40% శాతం అభివృద్ధి పనులకు వాడుకోవచ్చని అంతేకాకుండా గ్రామాభివృద్ధిని మెరుగుపరుచచ్చని సూచించారు. కాబట్టి గ్రామంలోని ప్రతి ఒక్కరు ఉపాధి హామీ కూలీలకు అండగా నిలిచి పనులు కొనసాగేలా చేయడం అందరి బాధ్యత అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీఓ మెహబూబ్, సెక్రెటరీ గంగారం, ఉప సర్పంచ్ పరమేష్ సొసైటీ వైస్ చైర్మన్ యామారాములు,వార్డు సభ్యులు కాజా నవాజ్ ఖాన్, మహేష్, భాస్కర్, రఘు, మధు, ఆనంద్, హైమద్, శంకర్. అగ్రికల్చర్ ఏ.ఈ మీనా, సొసైటీ సెక్రెటరీ జి శ్రీనివాస్ గ్రామస్తులు మాజీ ఎంపీపీ రఘు, అవారి గంగారం, విట్టల్ సార్, బసవరాజ్ పటేల్,శశికాంత్, బాలకృష్ణ,కుర్రి కృష్ణ, శివ కుమార్ యాదవ్, యోగేష్, మెక్క రమేష్,ఓంకార్, అశోక్ గ్రామ యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.