బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా అధికార ప్రతినిధిగా సుంకు నవీన్ ముదిరాజ్
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.. యువతను బీజేవైఎం వైపు ఆకర్షిస్తా
మేడ్చల్: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) మేడ్చల్ రూరల్ జిల్లా అధికార ప్రతినిధిగా సుంకు నవీన్ కుమార్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, అమరం మోహన్ రెడ్డి, బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు రాగం అర్జున్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ నాయకులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. మేడ్చల్ రూరల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని నవీన్ ముదిరాజ్ తెలిపారు. ముఖ్యంగా యువతను బీజేవైఎం వైపు ఆకర్షిస్తూ, పార్టీలో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి అవగాహన కల్పిస్తానని తెలిపారు.
యువత సామాజిక, రాజకీయ రంగాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ, పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ నాయకులకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానని సుంకు నవీన్ కుమార్ ముదిరాజ్ స్పష్టం చేశారు.