బీజేపీలో టికెట్ల అమ్మకం కలకలం: జిల్లా అధ్యక్షుడిపై రూ. 30 లక్షల డిమాండ్ ఆరోపణలు.పదవులకు పల్లంశెట్టి పండరి, అరుణ రాజీనామా!
కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 27 ప్రజావాణి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న కీలక నేతలు తమ పదవులకు రాజీనామా చేయడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీకి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి, మాజీ అసెంబ్లీ కో-కన్వీనర్ పల్లంశెట్టి పండరితో పాటు, బీజేపీ మండల కార్యదర్శి పల్లంశెట్టి అరుణ తమ పదవులను త్యజించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డిపై వారు చేసిన తీవ్ర అవినీతి ఆరోపణలు...