prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 October 2026, 7:00 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

బీఆర్‌ఎస్ యువ నాయకుడు అబ్బవతిని నరసింహ దసరా శుభాకాంక్షలు

ఘట్కేసర్, అక్టోబర్ 20 (ప్రజావాణి):

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్‌ఎస్ యువ నాయకుడు అబ్బవతిని నరసింహ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రజల్లో నూతనోత్సాహాన్ని నింపాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ప్రజలంతా ఐకమత్యంతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, ఆ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అబ్బవతిని నరసింహ ఆకాంక్షించారు.