prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 7:36 pm Digital Edition : PRAJA VANI

బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్.

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

మండల కేంద్రంలోని ఎల్కతుర్తి గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు జంగం రాజు,సూరవరం వేమారెడ్డి, వీరనారాయణపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు చదిరం రమేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు.
ఈ నేపథ్యంలో వారి స్వగృహాలకు వెళ్లి,మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని,కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్, తంగేడ మహేందర్, గొల్లే మహేందర్, శేషగిరి, కడారి రాజు, కుర్ర సాంబమూర్తి గౌడ్, కోరే రాజ్ కుమార్, చదిరం నాగేశ్వర్, శ్రీనివాస్, జూపాక జడ్సన్,మండల ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.