prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 8:38 am Digital Edition : PRAJA VANI

బిఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి చీరలు వితరణ

బిఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి చీరలు వితరణ..
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారంలో బీఆర్ఎస్ డివిజన్ యూత్ ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్ రెడ్డి కి చెందిన వీధిలోని బొడ్డెమ్మ పండుగ వేడుక మహిళలకు చీరలు వితరణ చేశారు.రూ.15 వేల విలువగల చీరలతో పాటు ఆడి పాడేందుకు కోలలు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ పండుగను మరింత ఉత్సాహంగా నిర్వహించుకునే అందుకే మహిళలకు చీరలు కోలలు అందజేసినట్లు తెలిపారు. కాగా యువతులు మహిళలు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.