బావిలో పడి యువరైతు మృతి
కూసుమంచి అక్టోబర్ 19 ప్రజావాణి రిపోర్టర్ RK : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లింగారాం తండా సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన బానోత్ అజయ్ (22) అనే యువరైతు ప్రమాదవశాత్తు జారిపడి బావిలో పడి మృతి చెందాడు.
పొలానికి నీరు పెట్టే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
చిన్న వయసులోనే యువరైతు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.