బాల్య వివాహాల నివారణకు గ్రామసభలో ప్రతిజ్ఞ
బాల్య వివాహాల నివారణకు గ్రామసభలో ప్రతిజ్ఞ దండేపల్లి, అక్టోబర్ 2 (ప్రజావాణి): పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా దండేపల్లి మండలం గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మేదరిపేట గ్రామంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే పిల్లల్లో పెరుగుదల, అభివృద్ధి లోపాలను గుర్తించి, అవసరమైన వైద్య ఆరోగ్య సేవలకు రిఫర్ చేయడంపై అవగాహన కల్పించారు. ఆరోగ్య శాఖ, రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (RBSK) బృందాల సమన్వయంతో 0 నుంచి 3 సంవత్సరాల వయస్సు గల...