బాధిత కుటుంబాలకు అండగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 08(ప్రజావాణి): జిల్లా లోని కోడకండ్ల మండలంలో బాధిత కుటుంబాలను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గురువారం పరామర్శించారు. మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు.
మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నామల బిక్షపతి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి వెంటనే వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అనంతరం అదే గ్రామానికి చెందిన జిలుకర గోపాల్ ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్థికంగా, నైతికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆ తర్వాత పెద్ద బాయి తండాకు వెళ్లారు. అక్కడ మాజీ ఎంపీటీసీ రామ్‌కోటి ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
అనంతరం గిర్ని తండాకు చేరుకుని, అనారోగ్యంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు హేమని సతీమణిని పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో కోడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.