బాధిత కుటుంబానికి ఆర్దిక చేయూత
బాధిత కుటుంబానికి ఆర్దిక చేయూత.. ప్రజావాణి,ఇనుగుర్తి:ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లి గ్రామానికి చెందిన గాజుల వెంకటమ్మ ఇటీవల కన్నుమూశారు. సంబంధిత బాధిత కుటుంబాన్ని ఆ గ్రామ సర్పంచి మలిశెట్టి శోభన్ తో పాటు పలువురు పరామర్శించారు. స్వర్గీయ వెంకటమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రూ.5 వేల నగదు కుటుంబ సభ్యులకు అందజేశారు. 50 కిలోల బియ్యం వితరణ చేశారు. అధైర్య పడవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మామిడి శోభన్, మాజీ ఎంపీటీసీ మంజుల మంగ్యా నాయక్...