బస్వాపూర్‌లో ఉపాధి హామీ పనులతో రోడ్డు ఏర్పాటు
నీళ్ల ట్యాంక్ వద్దకు వెళ్లేందుకు ఇబ్బందులు.. 50 మంది కూలీలతో మట్టి పనులు
మన ప్రజావాణి పుల్కల్, అక్టోబర్ 19 జిల్లా ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో ఇండ్ల వెనకాల ఉన్న నీళ్ల ట్యాంక్ వద్దకు వెళ్లేందుకు సరైన దారి లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన గ్రామ సర్పంచ్ భూమ్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహులు ఉపాధి హామీ పథకం కింద రోడ్డు ఏర్పాటు పనులు చేపట్టారు.
సుమారు 50 మంది ఉపాధి హామీ కూలీలతో ఇండ్ల వెనకాల నుంచి నీళ్ల ట్యాంక్ వద్దకు వెళ్లే మార్గంలో మట్టి పోసి దారి ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నీళ్ల ట్యాంక్ వద్దకు వెళ్లేందుకు గ్రామస్తులకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగనున్నాయి.
గ్రామ ప్రజల సౌకర్యార్థం రోడ్డు ఏర్పాటు పనులు చేపట్టడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.