* బయట నుండి వచ్చే విలేకరులపై తగు చర్యలు తీసుకోవాలని
*జవహర్ నగర్ సిఐకు వినతి పత్రం అందజేసిన స్థానిక విలేకరులు.*
జవహర్ అక్టోబర్ 1: నగర్( ప్రజావాణి ప్రతినిధి)
మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ ప్రాంతంలో విలేకరులమంటూ ఇతర ప్రాంతాల నుండి వచ్చి నిర్మాణాల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న బయటి నుండి వచ్చి జిల్లా స్టాపర్లం మండల రిపోర్టర్లు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని జవహర్ నగర్ స్థానిక విలేకరులు గురువారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐ సైదులను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇటీవల జవహర్ నగర్ లో మేము విలేకరులమే అంటూ బయట నుండి వచ్చి జవహర్ నగర్ లో ఉన్నవిలేకర్ల బుడుద జల్లి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువైందని వీటిని అరికట్టేందుకు స్థానిక విలేఖరులందరూ కలిసికట్టుగా సీఐని కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. జవహర్ నగర్ డేట్ లైన్ తో వార్తలు రాసే విలేకరులతో పాటు, పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసే విలేకరులను గుర్తించి త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఇష్టానుసారంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బెదిరింపులకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని విలేకరులు హెచ్చరించారు దీనిపై ముందస్తుగా సిఐకి సమాచారం అందించామని త్వరలోనే పూర్తిస్థాయి కార్యచరణ చేపడతామన్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బెదిరింపులకు పాల్పడే వారిపై నిఘా ఏర్పాటు చేశామని వారిపై కచ్చితంగా పోలీసు కేసు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక సమస్యలపై అవగాహన లేనివాళ్లు వార్తలు రాయక ఎక్కడి నుంచో వచ్చి వసూళ్లకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఇక ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సుదూర ప్రాంతాల నుంచి జవహర్ నగర్ వచ్చి ఇక్కడ బెదిరింపులకు పాల్పడుతూ అక్రమంగా వసూలు చేస్తున్న విలేకరులకు సహకరిస్తున్న వారికి సైతం తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు, అధికారులు తదితరులు నిబద్ధతతో పనిచేసే విలేకరులకు సహకరించాలని కోరారు. ఇట్లు జవహర్ నగర్ జర్నలిస్టులు