బద్వేల్ లో టీడీపీ మద్దతుదారుల ఘన విజయం: ఎగువ తంబళ్లపల్లె స్కూల్ కమిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్!
కలసపాడు మండలం ఎగువ తంబళ్లపల్లె అక్టోబర్ 03 ప్రజావాణి తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి దిశా నిర్దేశం మరియు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా జరిగిన పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు.నాయకులు, కార్యకర్తల సమన్వయంతో,సమిష్టి కృషితో సాధించిన ఈ విజయం నియోజకవర్గ తమ్ముళ్లలో కొత్త జోష్ నింపింది.ఎగువ తంబళ్లపల్లె పంచాయతీ పరిధిలోని రామాపురం హైస్కూల్ చైర్మన్‌గా తంబళ్లపల్లె...