prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 10:43 am Digital Edition : PRAJA VANI

బతుకమ్మ సంబరాలతో పాటు మొక్కలు నాటిన సెయింట్ డాన్ బాస్కో పాఠశాల

*బతుకమ్మ సంబరాలతో పాటు మొక్కలు నాటిన సెయింట్ డాన్ బాస్కో పాఠశాల*

• సంప్రదాయాల పరిరక్షణతో పాటు పర్యావరణ సంరక్షణకు పిలుపు

మన సమగ్ర ప్రజావాణి జోగిపేట, అక్టోబర్ 10: జిల్లా ప్రతినిధి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని జోగిపేటలోని సెయింట్ డాన్ బాస్కో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ సురేష్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని తెలిపారు. బతుకమ్మ పండుగ స్ఫూర్తితో విద్యార్థుల్లో ప్రకృతి ప్రేమ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు.
సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతిని ప్రేమించడం, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిస్టర్ అమల, పాఠశాల ప్రిన్సిపాల్ జిన్సీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించడంతో పాటు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. సంప్రదాయాల పరిరక్షణతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు పాఠశాల యాజమాన్యం చేపట్టిన కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.