బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన పొంగులేటి మాధురి
బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన పొంగులేటి మాధురి పెరికసింగారం, నాయకన్ గూడెంలో మహిళలతో కలిసి సంబరాలు కూసుమంచి ప్రజావాణి: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం పెరికసింగారం, నాయకన్ గూడెం గ్రామాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి పొంగులేటి మాధురి ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ముందుగా పెరికసింగారం గ్రామంలో నిర్వహించిన అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నాయకన్ గూడెం గ్రామంలో జరిగిన...