prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 12:35 pm Digital Edition : ELKATHURTHI

బతుకమ్మ, దసరా పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

బతుకమ్మ,దసరా పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.

ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే.శ్రీనివాస్

ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-

బతుకమ్మ,దసరా పండుగల సందర్భంగా మహిళా సోదరీమణులకు, ప్రజలందరికీ ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే.శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు.పండుగలను ప్రతి ఒక్కరూ సంతోషంగా,ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
ఆదివారం జరగనున్న సద్దుల బతుకమ్మ మంగళవారం దసరా పండుగ సందర్భంగా దుర్గామాతను కమిటీ సభ్యులు బక్తులు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ఇద్దరికి మించి ప్రయాణించకూడదని,మద్యం సేవించి వాహనాలు నడపకూడదని,వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. అతివేగం,నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని,ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరారు.
పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,పోలీసులకు సహకరించాలని సూచించారు. మహిళలు,యువతులు పండుగ వేడుకల్లో పాల్గొనే సమయంలో బంగారు ఆభరణాలు భద్రతా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌తో పాటు ఎల్కతుర్తి సర్కిల్ పరిధిలోని వంగర, భీమదేవరపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలందరూ పోలీసుల సూచనలు పాటిస్తూ పండుగలను సురక్షితంగా జరుపుకోవాలని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కోరారు.
ప్రజలందరికీ బొడ్డెమ్మ, బతుకమ్మ,దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ,పండుగ వేళ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.