prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 3:54 pm Digital Edition : PRAJA VANI

బడి తండాలో ఉచిత హెల్త్ క్యాంప్..

బడి తండాలో ఉచిత హెల్త్ క్యాంప్..
సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం..
సర్పంచి ధనమ్మ అమృనాయక్.
ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బడి తండాలో సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ డా.జంగాల రాజేశ్వరరావు,సాయిరాం హాస్పిటల్స్ డా.జంగాల స్వాతి సహకారంతో స్థానిక సర్పంచి బిలావత్ ధనమ్మ అమృనాయక్ అభ్యర్థన, అధ్యక్షతన సోమవారం ఉచిత హెల్త్ క్యాంప్, మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.దీనిని సర్పంచి ధనమ్మ అమృ నాయక్,పంచాయితీ కార్యదర్శి భాస్కర్ వార్డు సభ్యులు, ప్రభృతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ తండాలో పలు రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న పేద ప్రజల కోసం ఖమ్మం వైద్య నిపుణులు ఉచితంగా సేవలు అందించడం అభినందనీయమన్నారు.
పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం ఖమ్మం నుంచి సుమారు 25 మంది వైద్యులు నర్సులు,ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు వచ్చి పేదల ఆరోగ్యం కోసం సేవలందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

79 మందికి వైద్య సేవలు: డైరెక్టర్ సామ్యూల్

వివిధ డిసీజ్ ల తో బాధపడుతున్న 79 మంది కి పైగా వైద్య సేవలు అందించినట్లు జంగాల రాజేశ్వరరావు సేవ్ యువర్ ఫౌండేషన్ డైరెక్టర్ గెడ్డం సామ్యూల్ తెలిపారు. వైద్య పరీక్షలతో పాటు ఉచిత మందులు అందజేశామన్నారు.
వైద్య సేవలు అందించడంలో డా. ప్రశాంతి
డా.సైమా కైనత్,నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్,వార్డు సభ్యులు తండావాసులు పాల్గొన్నారు.