బడిలో ‘రంపపు’రాక్షసుడు: రాప్తాడు విద్యామందిరంలో ఉన్మాది ఘాతుకం.సభ్యసమాజం ముక్తకంఠంతో ఖండించాల్సిన దారుణం!
అనంతపురం (రాప్తాడు)అక్టోబర్ 31 ప్రజావాణి జ్ఞానాన్ని ప్రసాదించాల్సిన విద్యా మందిరం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. తోటి విద్యార్థులతో కలిసి ప్రశాంతంగా పాఠాలు వినాల్సిన క్లాస్‌రూమ్‌లో భయాందోళనలు రేగాయి. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చోటుచేసుకున్న ఉన్మాది దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న ఒక చిన్నారిపై ఓ నరరూప రాక్షసుడు చెట్లు నరికే కోతమిషన్ (రంపం) తో విచక్షణారహితంగా దాడికి తెగబడటం మానవత్వాన్ని నిలువునా దహించివేసింది. ఈ హృదయ విదారకర ఘటనను...