బంధువు కు పిట్టకు వేయడానికి వెళ్లి

బంధువు కు పిట్టకు వేయడానికి వెళ్లి.. చెరువులో స్నానం చేస్తూ వ్యక్తి మృతి.. ప్రజావాణి,ఇనుగుర్తి: సమీప బంధువైన వరుసకు నానమ్మ మూడవ రోజు కర్మకాండలో భాగంగా పక్షికి వేయడానికి వెళ్లిన మనుమడు చెరువులో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం లో చోటుచేసుకుంది. ఎస్సై పి.నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్న ముప్పారం గ్రామానికి చెందిన కాలేరు రవి(55) సమీప బంధువైన నానమ్మ కాలేరు ఉప్పలమ్మ మూడు రోజుల క్రితం మృతి చెందింది....