prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:39 pm Digital Edition : PRAJA VANI

బంగారిగడ్డలో కపాస్ కాంతి పథకం కింద అధిక సాంద్రత పత్తి సాగుపై అవగాహన

బంగారిగడ్డలో కపాస్ కాంతి పథకం కింద అధిక సాంద్రత పత్తి సాగుపై అవగాహన

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో కపాస్ కాంతి పథకంలో భాగంగా అధిక సాంద్రత పత్తి (HDPS) సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం సర్పంచ్ బోయపల్లి సునీత అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి పవన్ మాట్లాడుతూ.. అధిక సాంద్రత విధానంలో దగ్గర దగ్గరగా విత్తడం వల్ల పత్తి పంట ఒకేసారి చేతికి వస్తుందని, దీని ద్వారా పంట త్వరగా పూర్తయి అదే పొలంలో రెండో పంట వేసుకోవచ్చని తెలిపారు. ఈ విధానంలో ఎకరానికి 40 వేల మొక్కలు ఉంటాయని, ఇది సాధారణ పత్తి కంటే మూడు రెట్లు ఎక్కువని, దిగుబడి కూడా ఒకేసారి వస్తుందని వివరించారు. అలాగే వచ్చే యాసంగి లో బోర్ల కింద వరి వేయవద్దని, దానికి బదులు పెసర్లు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలు వేయడం మేలని సూచించారు. సర్పంచ్ సునీత మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎమ్ డి మహబూబ్, రైతులు తలారి నరసింహ, పల్లె యాదయ్య, నకిరేకంటి యాదయ్య, సుంకరి సాయి తదితరులు పాల్గోన్నారు.