ఫోక్సో కేసుల్లో దోషులైతే జీవితాలు అంధకారం
ఫోక్సో కేసుల్లో దోషులైతే జీవితాలు అంధకారం! చిన్నారుల రక్షణకు అవగాహనే ఆయుధం: జిల్లా అదనపు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు కూకట్పల్లి: అక్టోబర్ 31(ప్రజావాణి) చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని, ఫోక్సో కేసుల్లో దోషులుగా తేలితే జీవితాలు నాశనమవుతాయని జిల్లా అదనపు న్యాయమూర్తి, ఫోక్సో ప్రత్యేక కోర్టు ఇన్చార్జి జడ్జి ఎం. వెంకటేశ్వరరావు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కూకట్పల్లి మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం పల్లవి పాఠశాలలో నిర్వహించిన ‘సురక్షిత్ బచ్పన్...