*ఫైజాబాద్ లో దుర్గమ్మ సన్నిధిలో ఘనంగా అన్నదానం*
దాత అవుసలి ప్రభాకర్ కుటుంబానికి యూత్ అసోసియేషన్ ధన్యవాదాలు
చిలిపిచెడ్, అక్టోబర్ 16 మన ప్రజావాణి
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో దుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు శనివారం సాయంత్రం 7 గంటలకు హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో, దుర్గమ్మ అమ్మవారి సన్నిధానంలో అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ దుర్గమ్మ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి మహిపాల్ తెలియజేశారు.
అమ్మవారి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చిన దాత ఫైజాబాద్ గ్రామ వాస్తవ్యులు అవుసలి ప్రభాకర్ మరియు కుటుంబ సభ్యులు గత ఐదు సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్నారని, ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా అవుసలి ప్రభాకర్ కుటుంబానికి దుర్గా భవాని యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.