ఫైజాబాద్ లో ఘనంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు
*ఫైజాబాద్ లో ఘనంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు* బతుకమ్మ సంబరాల్లో బాల్య వివాహాలపై అవగాహన *చిలిపిచెడ్, అక్టోబర్ 15 (మన ప్రజావాణి నియోజకవర్గం ప్రతినిధి):* చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకుని బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, బాలికల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తుపై దాని ప్రభావం గురించి అధికారులు వివరించారు....