prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 2:58 pm Digital Edition : PRAJA VANI

ఫైజాబాద్ గ్రామపంచాయతీలో భూభారతి భూముల రీసర్వే గ్రామసభ అవగాహన సదస్సు

*ఫైజాబాద్ గ్రామపంచాయతీలో భూభారతి భూముల రీసర్వే గ్రామసభ అవగాహన సదస్సు*

257.16 ఎకరాల రీసర్వే పై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు –

చిలిపిచెడ్.అక్టోబర్15 మన ప్రజావాణి,నియోజక వర్గం ప్రతినిధి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూముల రీసర్వే కార్యక్రమంలో భాగంగా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామపంచాయతీ పరిధిలోని శేరి ఫైజాబాద్ రెవెన్యూ గ్రామంలో గ్రామసభ అవగాహన సదస్సును నిర్వహించారు.

మొత్తం 257.16 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న రీసర్వే, రైతులకు, ప్రజలకు అధికారులు వివరంగా అవగాహన కల్పించారు.

ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆర్డీవో హాజరై మాట్లాడుతూ.. ప్రతి సర్వే నంబర్ కు పక్కా హద్దులు నిర్ణయించి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే భూభారతి లక్ష్యమని అన్నారు. రైతులు తమ భూముల వద్ద ఉండి హద్దులు చూపించి, రెవెన్యూ శాఖకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్ డీ ఓ,ఎం పీ డీ ఓ, అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ సర్వేయర్, ఎ డీ, డీ ఏ,డీ ఐ, ఆర్ ఐ లు శ్రీహరి, సర్వేయర్లు, మండల పోలీస్ శాఖ అధికారులు, జీ పీ ఓ పంచాయతీ కార్యదర్శి నాగరాజు, సర్పంచ్ తాళ్ల రాములు, ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామ రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.