ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. అక్టోబర్ 5 (ప్రజావాణి)మంచాల: మంచాల మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల జరిగిన సర్వసభ సమావేశంలో ప్రోటోకాల్ పాటించకుండా సర్పంచ్‌లను అగౌరవపరిచారని ఆరోపిస్తూ మంచాల మండలంలోని బీఆర్‌ఎస్, సీపీఎం పార్టీలకు చెందిన సర్పంచ్‌లు
**రంగారెడ్డి జిల్లా కార్యాలయానికి వెళ్లి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించారు* .
*
సర్వసభ సమావేశంలో ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన తీరుపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సర్పంచ్‌లు కలెక్టర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో మంచాల మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, జాపాల సర్పంచ్ మంచాల రవి, లోయపల్లి సర్పంచ్ ఆంబోతు రఘురాం నాయక్, బోడకొండ సర్పంచ్ చందర్ నాయక్, ఎల్లమ్మతండా సర్పంచ్ జవహర్‌లాల్ నాయక్, రంగాపూర్ సర్పంచ్ నేనావత్ బాలకృష్ణ, చెన్నారెడ్డిగూడ సర్పంచ్ పగడాల విజయ వెంకటేష్, బండలేమూర్ సర్పంచ్ పాతులోత్ శ్రీనివాస్ నాయక్, ఆరుట్ల సర్పంచ్ మానిపాటి శోభ కుమార్, తాళ్లగూడ సర్పంచ్ జోగు శంకరయ్య, నోముల సర్పంచ్ శృతి కరుణాకర్ రెడ్డి, ఆగపల్లి సర్పంచ్ లక్కుమల్ల ఉమా యాదయ్య పాల్గొన్నారు.
అలాగే ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.