ప్రొద్దుటూరులో ధనియాల ప్రాసెసింగ్ యూనిట్లపై విజిలెన్స్ దాడులు రూ.1.48 కోట్ల విలువైన ధనియాలు స్వాధీనం ఇద్దరిపై కేసు నమోదు
ప్రొద్దుటూరు,కడప జిల్లా: అక్టోబర్ 8 ప్రజావాణి ధనియాల పొడి తయారీలో అక్రమ పద్ధతులు అవలంబిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరులోని ధనియాల ప్రాసెసింగ్ యూనిట్లపై విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండి బజారులోని పలు ప్రాసెసింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు, జ్యోతి ప్రాసెసింగ్ యూనిట్‌లో జరుగుతున్న వ్యవహారాలను పరిశీలించి కీలక వివరాలను గుర్తించినట్లు సమాచారం.ఇతర రాష్ట్రాల నుంచి ముడి ధనియాలను పెద్ద మొత్తంలో ప్రొద్దుటూరుకు తీసుకువచ్చి, వాటిని ప్రాసెసింగ్ చేసి ధనియాల పొడిగా మార్చే ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా...