prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 5:42 pm Digital Edition : PRAJA VANI

ప్రాధాన్య అభివృద్ది పనులను వేగవంతం చేయాలి

ప్రాధాన్య అభివృద్ది పనులను వేగవంతం చేయాలి….

జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

నియోజకవర్గం లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి పెండింగ్ లేకుండా సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ మద్దుపల్లి లో చేపట్టిన జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలు, ప్రధాన భవనం, అకాడమిక్ బ్లాక్ నిర్మాణాల పనుల నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. నిర్ణీత సమయానికి, క్వాలిటీ తో వేగంగా నిర్మాణాలు జరగాలని, కార్మికులను పెంచి అనుసంధానంగా పనులు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, విద్య, వైద్యం అభివృద్ధికి కీలకమైన కళాశాల భవనాల నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతలో రాజీ పడకుండా, ఇంజినీరింగ్ ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

పనుల సందర్భంగా అవసరమైన నిర్మాణ సామగ్రి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని, ప్రతి దశను ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో చేపట్టాలని ఆదేశించారు.

అభివృద్ధి పనుల అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఆనతరం వెంకటగిరి లో అసంపూర్తిగా ఉన్న జి పస్ల్ 2 భవనాలను కలెక్టర్ పరిశీలించారు. వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మద్దులపల్లి మార్కెట్ కమిటి చైర్మెన్ హరినాథ్ బాబు, ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ మహేష్ బాబు, ఖమ్మం రూరల్ తహసీల్దారు వినయేంద్రరెడ్డి, వైద్యశాఖ ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.