prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 5:13 pm Digital Edition : SRIKANTH MULUGU

ప్రాణం ఇచ్చిన వీరులకు.. ఘనంగా నివాళులు.

.

.వారి త్యాగం మరువలేనిది.. వారి స్ఫూర్తి చెరగనిది.

.అమరులకు ములుగులో అశ్రునివాళి.

ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నథ్ కేకన్ ఐపీఎస్

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ ( ప్రజావాణి)
ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు
అమరవీరులకు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ గారు ఘనంగా నివాళులర్పించారు
పోలీస్ విధి పవిత్రమైన కర్తవ్యమని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు
1959 హాట్ స్ప్రింగ్స్ ఘటన గుర్తుగా ప్రతి ఏటా ఈ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు
నక్సలిజం, టెర్రరిజంపై తెలంగాణ పోలీసుల పోరాటం దేశానికే ఆదర్శమని కొనియాడారు
మార్చి 31 నాటికి నక్సల్ రహిత దేశంగా మార్చడంలో తెలంగాణ పాత్ర కీలకమన్నారు
యువత కోసం జాబ్ మేళాలు, ఫ్రీ కోచింగ్, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు
అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు
ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ ఐపీఎస్ గారు అమరుల వివరాలు చదివి వినిపించారు
అమరవీరుల కుటుంబాలకు బహుమతులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.