ప్రశాంతతకు నిలయమైన అనంతపురం లో గత రెండున్నర సంవత్సరాలుగా దౌర్జన్యాలు, దోపిడీలు
కూటమి నేతల్లో ఓటమి భయం
పోలీస్, రెవిన్యూ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని సామాన్యుల ఆస్తులపై కన్ను
రేషన్ బియ్యంను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న ఎమ్మెల్యే అనుచరులు
కూటమి అరాచక పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు
అనంతపురం లో ఏ డివిజన్ కు వెళ్లినా వైయస్సార్ సీపీ అభ్యర్థులకు బ్రహ్మరథం
వైయస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ గౌడ్ తోపాటు, 62 మంది కార్పొరేటర్లను గెలిపించాలనే దృఢ నిశ్చయంతో నగర ప్రజలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం
నవోదయ కాలనీ టీడీపీ బూత్ కన్వీనర్ గాయత్రి తో పాటు పలుకుటుంబాలు వైయస్సార్ సీపీ లో చేరిక
అనంతపురం బ్యూరో అక్టోబర్19 ప్రజా వాణి
రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే ఓటమి భయంతో కూటమి నేతలు ఎక్కడ చూసినా వైయస్సార్ సీపీ అభ్యర్థులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. సోమవారం అనంతపురం నగరంలోని నవోదయ కాలనీ టీడీపీ బూత్ కన్వీనర్ గాయత్రి తో పాటు 27,29 డివిజన్ లకు చెందిన పలు కుటుంబాలు ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ అభ్యర్థి సి.రమేష్ గౌడ్ ల సమక్షంలో వైయస్సార్ సీపీ లోకి చేరారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతతకు నిలయమైన అనంతపురం లో గత రెండున్నర సంవత్సరాలుగా దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కువైపోయాయన్నారు. రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని సామాన్యుల ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. పేదల ఇల్లు, స్థలాలను లాక్కుంటున్నా పోలీస్ వ్యవస్థ ప్రేక్షక పాత్ర పోషిస్తుందని వాపోయాడు. పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యంను ఎమ్మెల్యే అనుచరులు బ్లాక్ మార్కెట్ లో,అమ్ముకుంటుంన్నారన్నారు. కూటమి ప్రజాప్రతినిధులు తీరుకు అనంతపురం నగర ప్రజలు విసిగిపోయారని, నగరంలోని ప్రతి డివిజన్లోనూ వైయస్సార్ సీపీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ తో పాటు 62 డివిజన్ లలో పోటీ చేస్తున్న వైయస్సార్ సీపీ కార్పొరేటర్లను గెలిపించాలనే దృఢ నిశ్చయంతో నగర ప్రజలు వున్నారన్నారు.
జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమం అందిస్తామంటూ సూపర్ సిక్స్ పథకాలతో అధికారంలోకి వచ్చి సంక్షేమం పథకాలను అమలు చేయకపోగా నిత్యవసర సరుకుల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నా ప్రభుత్వం నుండి సహాయక చర్యలు శూన్యమని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంపంగి రామంజీనేయులు, నాయకులు చిరంజీవి, గుజ్జల నారాయణ, సంపంగి రవి కుమార్, సర్దార్, తిరుపాలు, శశిధర్ రెడ్డి,విజయ్, మధు,శ్రీరాములు,హుస్సేన్,సాకే రామంజి నేయులు,నాగరాజు,ప్రభాకర్,దివాంజీ రావు, శివ శంకర, నారాయణ స్వామి,వెంకీ,ఆధామ్ తదితరులు పాల్గొన్నారు.