prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 11:56 am Digital Edition : PRAJA VANI

ప్రశాంతంగా పండుగ చేసుకుంటే.. పోలీసులు మీకు అండ

ప్రశాంతంగా పండుగ చేసుకుంటే.. పోలీసులు మీకు అండ
-పస్రా SI తాజుద్దీన్

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌(ప్రజావాణి)
ములుగు జిల్లా, గోపిందరావుపేట మండలం పసర ఎస్సై తాజుద్దీన్ దసరా సెలవుల సందర్భంగా ప్రజలు ఆనందంగా పండుగ జరుపుకోవాలని, అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పండుగ సందర్భంగా ప్రయాణాలు చేసేటప్పుడు భద్రతా నియమాలు తప్పక పాటించాలని, వేగంగా వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.
చెరువులు, కుంటలు, వాగుల వద్ద పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులకు సూచించారు. దసరా వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పసర పోలీసులు పగలు-రాత్రి గస్తీ నిర్వహిస్తున్నారని తెలిపారు.
పండుగ సందర్భంగా ఎవరైనా గొడవలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే వెంటనే పసర పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని కోరారు.