ప్రమాణం యాప్‌ ద్వారానే హాజరు నమోదు చేయాలి

ప్రమాణం యాప్‌ ద్వారానే హాజరు నమోదు చేయాలి. భూపాలపల్లి, మన ప్రజావాణి : జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఇకపై మీ ప్రమాణం యాప్‌ ద్వారానే హాజరు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశపు హాలులో మీ ప్రమాణం హాజరు యాప్‌ వినియోగంపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ విధానాన్ని వచ్చే వారం నుండి తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, సమయపాలన, జవాబుదారీతనం పెంచే...