ప్రభుత్వ హామీ నీటిమీద రాతలు

*ప్రభుత్వ హామీ నీటిమీద రాతలు - ఆకలి కేకలతో ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలు* *రాయికల్, అక్టోబర్ 16 (ప్రజావాణి):* ఉపాధి హామీ పథకానికి వెన్నెముకగా నిలుస్తూ గత 20 సంవత్సరాలుగా గ్రామాల్లో ఎండనకా వాననకా శ్రమిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల బతుకులు దినదినగండంగా మారుతున్నాయి. పథకం పేరు వీబీ-జీ రామ్ జీ గా మారినా, వారి తలరాతలు మాత్రం మారలేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రతిరోజూ వేకువజామునే లేచి ఇంటింటికి తిరిగి కూలీలను మోటివేట్ చేసి పనులు కల్పించడం, మండుటెండలో కొలతలు వేయడం, మస్టర్ రోల్స్ నిర్వహించడం,...