ప్రభుత్వ బడుల అభివృద్ధికి నందం గణేష్ బాబు చేయూత….కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలకు రంగులు.. ‘మన బడులు.. మన బాధ్యత’ కార్యక్రమానికి సహకారం
ఘట్కేసర్, అక్టోబర్ 26 (ప్రజావాణి): ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు పిలుపునిచ్చారు. స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘మన బడులు.. మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ఆయన తనవంతు సహకారం అందించారు. నందం గణేష్ బాబు సహకారంతో పాఠశాల తరగతి గదులు, ప్రహరీ గోడతో పాటు పాఠశాల...